Simhachalam Temple: అప్పన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:40 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.శ్రీనివాస్, జస్టిస్ ఎ.హరిహరనాథ్ శర్మ, జస్టిస్ జ్యోతిర్మయి దంపతులు ఆదివారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
సింహాచలం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.శ్రీనివాస్, జస్టిస్ ఎ.హరిహరనాథ్ శర్మ, జస్టిస్ జ్యోతిర్మయి దంపతులు ఆదివారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. తొలుత వీరికి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎన్.సుజాత, ఏఈఓ కె.తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణాధికారి బి.సత్యశ్రీనివాస్ ఆలయ ఆచారం ప్రకారం స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం న్యాయమూర్తుల గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి, శేష వస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు వేదాశీర్వచనాలీయగా అధికారులు స్వామివారి ఫొటో, ప్రసాదాలను అందజేశారు.