Share News

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:08 AM

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున ఆలయంలో సుప్రభాతసేవలో పాల్గొని...

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున ఆలయంలో సుప్రభాతసేవలో పాల్గొని, తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అలాగే ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - Apr 20 , 2026 | 04:11 AM