పాస్టర్ల ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల రద్దుకు ఆదేశించండి
ABN , Publish Date - May 06 , 2026 | 05:42 AM
క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న పాస్టర్ల ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
హైకోర్టులో పిటిషన్
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న పాస్టర్ల ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్నతాధికారులకు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను జూలై 6కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.విజయ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పాస్టర్లుగా పనిచేస్తూ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినవారి సర్టిఫికెట్లు రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ షెడ్యూల్డ్‌కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాప్తిజం తీసుకున్నవారి పేర్లను నమోదు చేసేందుకు వీలుగా చర్చిలవద్ద రిజిస్టర్లు నిర్వహించేలా ఆదేశాలు ఇ వ్వాలని కోరారు.ఈవ్యాజ్యం మంగళవారం విచారణకు రా గా పిటిషనర్ తరఫున నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం పాస్టర్లు ఎస్సీ సర్టిఫికెట్లు కలిగి ఉండడానికి వీల్లేదన్నారు.