Share News

కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:16 AM

కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందున వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు...

కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందున వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కాకాణికి నోటీసులు జారీచేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్‌ ్జ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని, అడ్డుకున్న గిరిజనులను కులం పేరుతో దూషించారంటూ నమోదైన కేసులో.. గతేడాది ఆగస్టు 18న కాకాణికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సోమవారం జరిగిన విచారణలో సోమిరెడ్డి తరఫు న్యాయవాది కె.పల్లవి వాదనలు వినిపిస్తూ... కాకాణి విలేకరుల సమావేశం నిర్వహించి పిటిషనర్‌తోపాటు ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని, కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందున ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు.

Updated Date - Mar 31 , 2026 | 06:16 AM