Share News

High Court: ప్రత్యామ్నాయ ఉద్యోగమా.. పరిహారమా?

ABN , Publish Date - Jan 10 , 2026 | 06:05 AM

అనారోగ్య కారణా లతో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీనం చేసిన తరువాత నిలిచిపోయిన...

High Court: ప్రత్యామ్నాయ ఉద్యోగమా.. పరిహారమా?

  • ఎనిమిది వారాల్లోగా ఐచ్ఛికాలు ఇవ్వండి

  • అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఉపశమనం

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణా లతో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీనం చేసిన తరువాత నిలిచిపోయిన ఆర్ధిక ప్రయో జనాలు, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన విషయంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రవాణాశాఖ జారీ చేసిన జీవో 58ని అనుసరించి ప్రత్యామ్నాయ ఉద్యోగం కావాలా? లేక పరిహారం కావాలా? అనే విషయాన్ని తెలియపరు స్తూ 8వారాల్లోగా ఐచ్ఛికాలు ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశిం చింది. అదనపు పరిహారం కోసం వచ్చిన వినతుల ను గరిష్ఠంగా 3 నెలల్లోగా, ప్రత్యామ్నాయ ఉద్యోగం కోసం వచ్చిన వినతులను ఖాళీల లభ్యతను బట్టి 6నెల ల్లోగా పరిష్కరించాలని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిం చింది.ఈమేరకు హైకోర్టు సింగిల్‌జడ్జి ఇటీవల తీర్పిచ్చారు.

Updated Date - Jan 10 , 2026 | 06:05 AM