లొంగుబాటు నుంచి మినహాయింపు ఉత్తర్వులు పొడిగింపు
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:14 AM
మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి...
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డిల బెయిల్ పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకొనేంత వరకు లొంగుబాటు నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశిస్తూ బెయిల్ పిటిషన్ల పై విచారణను జూన్ 24కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.