Share News

రేపు బీసీ గర్జన సభకు అనుమతి

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:18 AM

బీసీ సింహగర్జన పేరుతో ఈ నెల 22న బీసీవై పార్టీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చింది.

రేపు బీసీ గర్జన సభకు అనుమతి

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): బీసీ సింహగర్జన పేరుతో ఈ నెల 22న బీసీవై పార్టీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చింది. ‘బహిరంగ సభను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5వరకే నిర్వహించాలి. పిటిషనర్‌ తన సొంత ఖర్చుతో ఆహారం, తాగునీరు, ప్రాథమిక వైద్యసహాయంతో కూడిన అంబులెన్స్‌, సీసీటీవీ కెమెరాలు, పారిశుధ్య ఏర్పాట్లు చేసుకోవాలి. జాతీయ రహదారిపై ప్రయాణాలకు ఆటంకం కలిగించరాదు. ఎలాంటి ర్యాలీ నిర్వహించకూడదు. ఆహ్వానితుల సంఖ్య పది వేలకు మించకూడదు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే పిటిషనర్‌ బాధ్యత వహించాలి. చట్టనిబంధనలు ఉల్లంఘిస్తే బలవంతపు చర్యలకు ఉపక్రమించే అధికారం పోలీసులకు ఉంటుంది’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు శుక్రవారం తీర్పు ఇచ్చారు.

Updated Date - Feb 21 , 2026 | 04:19 AM