అసిస్టెంట్ కమిషనర్ శాంతి సస్పెన్షన్‌పై జీవో 22 మేరకు నిర్ణయం: హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:50 AM
దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి సస్పెన్షన్‌పై సాధారణ పరిపాలనశాఖ 2024 ఫిబ్రవరి 29న...
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి సస్పెన్షన్‌పై సాధారణ పరిపాలనశాఖ 2024 ఫిబ్రవరి 29న జారీ చేసిన జీవో నంబరు 22 ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. సస్పెన్షన్ ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శాంతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రభుత జీవో నంబరు 22 ప్రకారం ఏడాదికి మించి సస్పెండ్ చేయడానికి వీల్లేదని, ఎలాంటి కారణం లేకుండా సస్పెన్షన్ కొనసాగించాలని కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.