High Court: ప్రతి జిల్లాలో తక్షణం రెండు షెల్టర్ హోమ్‌లు
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:41 AM
రాత్రి వేళ్లలో ఫుట్‌పాత్‌ల మీద నిద్రిస్తూ జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో తక్షణం కనీసం 2 షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఒకటి మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి
ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాత్రి వేళ్లలో ఫుట్‌పాత్‌ల మీద నిద్రిస్తూ జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో తక్షణం కనీసం 2 షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటిలో ఒకటి ప్రత్యేకంగా మహిళల కోసమే ఉండాలని స్పష్టం చేసింది. నిరాశ్రయులు పగటి పూట పనికి వెళ్లి, రాత్రి రావడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ ఆశ్రయ గృహాలు ఉండాలని తేల్చిచెప్పిం ది. ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాల్లో నిద్రించే వారిని షెల్ట ర్ హోమ్‌లకు తరలించడంతో పాటు వారికి తగిన వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. నిరాశ్రయులను ఆశ్రయ గృహాలకు తరలించే సమయంలో వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించవద్దని, వారి శ్రేయస్సు కోసమే ఇది చేస్తున్నట్లు కౌన్సిలింగ్ ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తమ ఆదేశాల అమలుకు సంబంధించి 3 వారాల్లో స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజయవాడ లో ప్రస్తుతం 4 షెల్డర్ హోమ్‌లు ఉన్నాయని, నగరంలో ఉన్న 750 మంది నిరాశ్రయులకు ఇవి సరిపోవని అభిప్రాయపడింది. తక్షణం 6 షెల్టర్ హోమ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టం చేసింది. ప్రభుత్వ భవనాలు లేకపోతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసిం ది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
వారందరికీ ఆశ్రయం కల్పించాలి
కృష్ణా బ్యారేజ్ పేవ్‌మెంట్(కాలినడక మార్గం)పై రాత్రు ళ్లు తీవ్ర చలిలో గడుపుతున్న అనాథలు, నిరాశ్రయుల సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని, పట్టణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన మిషన్ కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నివాసం(షెల్డర్ ఫర్ అర్బన్ హోంలెస్)’ స్కీమ్ కింద వారందరికీ ఆశ్రయం కల్పించేలా ఆదేశా లు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది ఎన్.ఆది రామకృష్ణుడు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ఇటీవల మరోసారి విచారణకు వచ్చిం ది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. విజయవాడ లో 4 షెల్టర్ హోమ్‌లు ఉండగా.. అందులో ఒకటి మహిళలకు కేటాయించామన్నారు. కొత్త షెల్టర్ హోమ్‌ల నిర్మాణానికి ప్రతిపాదలను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘షెల్టర్ హోమ్‌లన్నీ కిక్కిరిసి ఉన్నాయి. తక్షణం కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలను తీసుకొని, సమస్యను వెంటనే పరిష్కరించాలి.’ అని ఽఉత్తర్వుల్లో పేర్కొంది.