High Court: బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:28 AM
రాష్ట్రంలో బీసీ కులగణన పూర్తిచేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని..
ఆ వివరాలు సమర్పించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ కులగణన పూర్తిచేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. విద్య, ఉద్యోగాల్లోనూ వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. కులగణనకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..? లేదా..? అనే వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.