హెటెరోలో ప్రమాదం
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:41 AM
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలో గల హెటెరో ఔషధ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం సంభవించింది.
కూలిపోయిన శ్లాబ్ లేయర్
అసిస్టెంట్ మేనేజర్ మృతి
నక్కపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలో గల హెటెరో ఔషధ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం సంభవించింది. యూని ట్-3 విభాగానికి చెందిన కార్యాలయ భవనం శ్లాబ్ ఒక లేయర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ మృతిచెందగా, మరో సీనియర్ మేనేజర్ స్వల్పంగా గాయపడ్డారు. నక్కపల్లి ఎస్‌ఐ అంజుమా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూనిట్-3లోని ఒక ఆఫీస్ రూమ్ శ్లాబ్ పెచ్చులూడి పడడంతో అసిస్టెంట్ మేనేజర్ బి.చిరంజీవి (39) తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా మృతి చెందారన్నారు. ఇదే ప్రమాదంలో మరో సీనియర్ మేనేజర్ షేక్ మస్తాన్ వల్లీ (46) స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు. మృతిచెందిన అసిస్టెంట్ మేనేజర్ చిరంజీవి నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన వారని, గాయపడిన సీనియర్ మేనేజర్ గుంటూరుకు చెందినవారని, ఆయన నక్కపల్లిలోనే నివాసం ఉంటున్నారని చెప్పారు. నక్కపల్లి సీఐ జె.మురళీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.