Share News

హెరిటేజ్‌ ఫుడ్స్‌పై తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:49 AM

హెరిటేజ్‌ ఫుడ్స్‌పై జగన్‌ పత్రికలో అసత్య వార్తలు ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జె.సాంబమూర్తి తెలిపారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌పై తప్పుడు ప్రచారం

  • మా ఉత్పత్తుల్లో హానికర పదార్థాల్లేవు

  • హెరిటేజ్‌ ఫుడ్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): హెరిటేజ్‌ ఫుడ్స్‌పై జగన్‌ పత్రికలో అసత్య వార్తలు ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జె.సాంబమూర్తి తెలిపారు. తమ ఉత్పత్తులను ల్యాబ్‌కు పంపి పరీక్షించగా, ఎలాంటి హానికర పదార్ధాలు లేవని రిపోర్టుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. గత డిసెంబరు 18న తమకు జారీ అయిన నోటీసుపై గురుగ్రామ్‌లోని ఫుడ్‌ సేఫ్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటికే స్టే మంజూరు చేసిందని తెలిపారు. తప్పుడు వార్తలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన వినియోగదారులను కోరారు.

Updated Date - Feb 09 , 2026 | 04:50 AM