హెల్మెట్ పెట్టు బ్రో!
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:37 AM
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై బుల్లితెర నటులు ప్రచారం చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శనివారం అనంతపురం జిల్లా కేంద్రానికి...
అనంతలో రోడ్డు భద్రతపై బుల్లితెర నటుల ర్యాలీ
అనంతపురం క్రైం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై బుల్లితెర నటులు ప్రచారం చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శనివారం అనంతపురం జిల్లా కేంద్రానికి వచ్చిన నటులు రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి నగరంలోని క్లాక్‌టవర్ మీదుగా ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. నటులు ప్రభాకర్, సుస్మిత, పవన్‌సాయి, అనిల్, శ్రీరాం తదితరులు ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీ్‌పతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో.. హెల్మెట్ ముద్దు బ్రో, ట్రిపుల్ రైడిం గ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వద్దు..’ అం టూ నినాదాలు చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని వారు కోరారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని తెలిపారు.