Helicopter Ride: కోనసీమలో సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్!
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:01 AM
ఓ ఐదు వేలు మీవి కావనుకుంటే సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్ చేయొచ్చు!
నరసాపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఓ ఐదు వేలు మీవి కావనుకుంటే సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్ చేయొచ్చు! హైద్రాబాద్‌కు చెందిన విహాగ్ సంస్థ పండగ 3 రోజులూ ఈ అవకాశం కల్పిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రైడ్‌లో.. అంతర్వేదిఆలయం, సాగర తీరం, లైట్ హౌస్, అన్న చెల్లెళ్ల గట్టు, కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్ల అందాలను వీక్షించొచ్చు. టికెట్ ధర రూ.5వేలు కాగా, 25 కి.మీ.మేర 25 నిమిషాల పాటు గగనంలో విహరించొచ్చు!.