శ్రీశైలంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:39 AM
వరుస సెలవుల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల రాకతో శ్రీశైల పుర వీధులు కిటకిటలాడుతున్నాయి.
శ్రీశైలం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): వరుస సెలవుల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల రాకతో శ్రీశైల పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న సర్వ దర్శనం భక్తులకు దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుండగా శీఘ్ర అతిశీఘ్ర దర్శనాలకు మూడు, నాలుగు గంటల సమయం, ఆన్‌లైన్ స్పర్శ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ వైపు వచ్చి వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.