Share News

ఉత్తరాంధ్రలో అకాల వానలు

ABN , Publish Date - May 02 , 2026 | 04:03 AM

రాష్ట్రంలో ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. శుక్రవారం ఉత్తరాంధ్రలో అనేకచోట్ల, కోస్తా, రాయలసీమల్లో అక్క డక్కడా ఈదురుగాలులతో ..

ఉత్తరాంధ్రలో అకాల వానలు

  • పిడుగురాళ్లలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. శుక్రవారం ఉత్తరాంధ్రలో అనేకచోట్ల, కోస్తా, రాయలసీమల్లో అక్క డక్కడా ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విశాఖ జిల్లా ఆనందపురంలో 51.5, విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.5వర్షపాతం నమోదైంది. కోస్తా, సీమల్లోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 252 మండలాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమల్లోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా, మన్యం జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి పంట కు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో మెరుపులు, పిడుగులతో వాన పడింది. శ్రీకాకుళం జిల్లాలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు కడప జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులకు 478 ఎకరాల్లో అరటి నేలమట్టమైంది. దీంతో దాదాపు రూ.11కోట్లమేర నష్టపోయిన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Updated Date - May 02 , 2026 | 04:03 AM