వడగాడ్పులకు ఒక్క ప్రాణమూ పోవద్దు: అనిత
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:59 AM
ఎండల తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
అమరావతి, మార్చి 10(ఆంధజ్ర్యోతి): ఎండల తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రత, వడగాడ్పుల సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 గురించి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్లకు సూచించారు. వేసవిలో అధికార యంత్రాంగం సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ -2026’ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనుషులతో పాటు, పశు ప్రాణనష్టం కూడా జరగకుండా చూడాలన్నారు.