Share News

మండలి ప్రశ్నోత్తరాలు వాడివేడిగా.. !

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:32 AM

శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ నడిచింది.

మండలి ప్రశ్నోత్తరాలు వాడివేడిగా.. !

ఇంటర్నెట్ డెస్క్: శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ నడిచింది. సభ్యులు రోజుకు రెండు ప్రశ్నలే అడగాలని, అనుబంధంగా మూడు అంశాలతో ప్రశ్న క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని చైర్మన్‌ సూచించారు. ప్రశ్నలకు ఎక్కువ అనుబంధాలు వద్దన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలపై హోంమంత్రి అనిత సమాధానం ఇవ్వగా, వైసీపీ సభ్యురాలు కళ్యాణి మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, గంజాయి అదుపు కాలేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ అనురాధ జోక్యం చేసుకుని అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో గంజాయి విచ్చలవిడిగా ఉందని, ఇప్పుడు సాగు ఆగిందని టీడీపీ సభ్యుడు శ్రీకాంత్‌ చెప్పారు. వీటిని శాంతిభద్రతలపై చర్చలో మాట్లాడాలని బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు సూచించారు.

Updated Date - Feb 25 , 2026 | 04:32 AM