అవయవదానంతో నలుగురికి పునర్జన్మ
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:35 AM
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు.
జగ్గయ్యపేట యువకుడి తల్లిదండ్రుల పెద్దమనసు
జగ్గయ్యపేట, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని చెరువుబజార్ చిన్నరామమందిరం వద్ద నివాసం ఉండే ఉత్తపళ్ల వెంకటేశ్వర్లు కుమారుడు విజయ కుమార్ (23) హైదరాబాద్ మాదాపుర్‌లో ఓ సంస్థలో టాక్స్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో కారు ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. రెండు రోజులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పారు. చికిత్సకు శరీరం సహకరించకపోవటంతో కుటుంబ సభ్యులకు విషయం వివరించి అవయవదానం ప్రాముఖ్యాన్ని వివరించారు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో మంగళవారం అతని అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా తరలించి నలుగురికి అమర్చారు.