Share News

రామ్మా.. చిలుకమ్మా!

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:07 AM

మక్కువగా పెంచుకున్నారు.. మాటలు నేర్పారు.. చిలుక పలుకులు వింటూ మురిసిపోయారు.. మురిపెంగా పెంచుకుంటున్న ఆ చిలుక ఓ రోజు ఎటో ఎగిరిపోవడంతో యజమాని ఆవేదన వర్ణనాతీతమైంది.

రామ్మా.. చిలుకమ్మా!

  • ఎగిరిపోయిన పెంపుడు చిలుక కోసం యజమాని ఆవేదన

కాట్రేనికోన, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మక్కువగా పెంచుకున్నారు.. మాటలు నేర్పారు.. చిలుక పలుకులు వింటూ మురిసిపోయారు.. మురిపెంగా పెంచుకుంటున్న ఆ చిలుక ఓ రోజు ఎటో ఎగిరిపోవడంతో యజమాని ఆవేదన వర్ణనాతీతమైంది. గ్రామంలోనే మరొకరి ఇంట్లో చిలుక బందీగా ఉందని తెలిసి ఆ ఆవేదన మరింత ఎక్కువైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన కొత్తపాలెం నివాసి బండారు దొరబాబు ఓ పక్షి ప్రేమికుడు. స్థానికంగా వస్త్రాల వ్యాపారం చేసే ఆయన రూ. 80,000 పెట్టి ఆఫ్రికన్‌ గ్రే ప్యారట్‌ జాతి చిలుకను కొని ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది. చిలుక కోసం అన్వేషిస్తుండగా, తమ గ్రామంలోనే వేరొకరి ఇంట్లో ఉన్నట్టు సమాచారం వచ్చింది. ఆ ఇంటికి వెళ్లి చిలుకను ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డా, కొంత నగదు సైతం ఇస్తానంటూ చెప్పినా ఆ ఇంటి యజమాని స్పందించడంలేదు. తమ వద్ద లేదంటూ ఆ ఇంటి యజమాని చెబుతున్నారు. దీంతో చేసేది లేక చిలుక యజమాని పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు.

Updated Date - Jan 24 , 2026 | 05:09 AM