భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ స్ర్కీనింగ్
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:59 AM
రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్లకు హెల్త్ స్ర్కీనింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్లకు హెల్త్ స్ర్కీనింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 36-45 ఏళ్ల వయస్సున్న భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ స్ర్కీనింగ్ చేయాలని, ఇందుకు టెండర్ ద్వారా కంపెనీని ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీనికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీంతోపాటు పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని బోర్డు తీర్మానించింది.