Share News

ఆహార కల్తీపై ఫోకస్‌ పెంచాం: సత్యకుమార్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:36 AM

ఆహార పదార్థాల కల్తీపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందని, ఈ-కామర్స్‌ డార్క్‌ స్టోర్స్‌పై నిఘా పెంచామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

ఆహార కల్తీపై ఫోకస్‌ పెంచాం: సత్యకుమార్‌

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఆహార పదార్థాల కల్తీపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందని, ఈ-కామర్స్‌ డార్క్‌ స్టోర్స్‌పై నిఘా పెంచామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, గళ్లా మాధవీ, బొలిశెట్టి శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. డార్క్‌స్టోర్లపై నిఘా పెంచి, ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నామని చెప్పారు. కాగా, ‘ప్రతి ఇంటా స్వదేశీ’ నినాదం అందిపుచ్చుకోవాలని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు ముందుకొచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. వికసిత్‌ భారత్‌ సాధనలో ఏపీ అగ్రగామిగా ఉంటుందంటూ ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 03:57 AM