నెహ్రూ కంటే అత్యధిక కాలం ప్రధానిగా నరేంద్ర మోదీనే
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:31 AM
దేశంలో ఎన్నికైన ప్రధాన మంత్రుల్లో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా మోదీ రికార్డు నెలకొల్పడం నవ భారత ఆవిష్కరణకు శుభ సూచికగా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ కొనియాడారు.
నవభారత ఆవిష్కరణకు శుభ సూచిక: మంత్రి సత్యకుమార్
అమరావతి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నికైన ప్రధాన మంత్రుల్లో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా మోదీ రికార్డు నెలకొల్పడం నవ భారత ఆవిష్కరణకు శుభ సూచికగా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశంలో పలు రంగాల్లో అనూహ్యమైన, సానుకూలమైన, ప్రజోపయోగకరమైన మార్పులు సంభవించాయని మంగళవారం ఓ ప్రకటనలో కొనియాడారు. ‘2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులతో నైరాశ్యానికి గురై.. సమర్థ నాయకుడి కోసం ఎదురుచూసిన ప్రజలు.. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీని స్పష్టమైన మెజారిటీతో గెలిపించారు. వారు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సమర్థ నాయకత్వం, సుపరిపాలన, సంస్కరణలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పటిష్ఠ అమలు ద్వారా మరో రెండుసార్లు మోదీ ప్రధానిగా ఎన్నిక కావడం విశేషం. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానిని ప్రజలు మరింతగా ఆదరిస్తున్నారు’ అని తెలిపారు.