Share News

మధ్యాహ్న భోజనం బాగోలేదని డ్రామా!

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:15 AM

‘అధ్వాన్న భోజనం’ డ్రామాకు సూత్రధారి అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

మధ్యాహ్న భోజనం బాగోలేదని డ్రామా!

  • మైలవరం హెచ్‌ఎంపై సస్పెన్షన్‌ వేటు

  • సర్కారుకు చెడ్డపేరు తెచ్చే

  • ప్రయత్నంగా విచారణలో గుర్తింపు

మైలవరం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘అధ్వాన్న భోజనం’ డ్రామాకు సూత్రధారి అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం పట్టణంలోని తారక రామానగర్‌ మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తినలేకపోతున్నామని గత మంగళవారం విద్యార్థులు నిరసన తెలిపారు. అన్నం సరిగా ఉడకలేదని, పులిహోరలో ఉప్పు లేదని, ఉడికీ ఉడకని గుడ్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆహారాన్ని డస్ట్‌బిన్‌లో పడేశారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో పాటు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారిణి వై. చంద్రకళ పాఠశాలను సందర్శించి, విచారణ చేపట్టారు. మధ్యాహ్నం భోజనం బాగాలేదని స్వయంగా హెచ్‌ఎం జాన్‌ విద్యార్థులను తప్పుదారి పట్టించి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా వ్యవహరించినట్టు గుర్తించారు. జాన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Mar 13 , 2026 | 04:16 AM