Share News

దేశ సంస్కృతి, సంప్రదాయాలు అంతరించే ప్రమాదం

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:02 AM

దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాలు అంతరించే ముప్పు ఉందని.., పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలే గాడిలో పెట్టాలని...

దేశ సంస్కృతి, సంప్రదాయాలు అంతరించే ప్రమాదం

  • మఠాలు, ఆధ్యాత్యిక క్షేత్రాలే గాడిలో పెట్టాలి

  • కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి

మంత్రాలయం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాలు అంతరించే ముప్పు ఉందని.., పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలే గాడిలో పెట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదివారం గురువైభవోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన యోగీంద్ర క ళా మంటపంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత కాలంలో చాలామంది కుటుంబ బాంధవ్యాలకు దూరంగా ఉంటున్నారని గుర్తుచేశారు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్ల మధ్య అవగాహన లోపం, గౌరవం, భయం, భక్తి లేపోవడంతో మనభారత సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు కుమారస్వామి రాఘవేంద్ర స్వామిని దర్శించి, మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.

Updated Date - Feb 23 , 2026 | 05:03 AM