Share News

బాబు-పవన్‌ కాంబినేషన్‌ బాగు

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:23 AM

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనలో, అభివృద్ధిలో సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కొనియాడారు.

బాబు-పవన్‌ కాంబినేషన్‌ బాగు

  • లోకేశ్‌కు మంచి భవిష్యత్‌ ఉంది: కుమారస్వామి

నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనలో, అభివృద్ధిలో సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కొనియాడారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే ఎలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందో రాష్ట్రమే ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌ బాగుందన్నారు. ఐటీ మంత్రి లోకేశ్‌ తన కార్యశైలితో తండ్రికి తగిన తనయుడిగా నిరూపించుకుంటున్నారని ప్రశంసించారు. ఆయనకు మంచి భవిష్యత్‌ ఉందన్నారు. ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ఉక్కు కర్మాగారానికి సోమవారం జరిగిన భూమి పూజలో కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. నూతన స్టీల్‌ ప్లాంట్‌తో అనుబంధ పరిశ్రమలు వస్తాయని.. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమ రావడం వెనుక ఐటీ మంత్రి లోకేశ్‌ కృషి ఎంతో ఉందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు.

Updated Date - Mar 24 , 2026 | 05:24 AM