జోగి రమేశ్‌కు నోటీసులిచ్చి వివరణ తీసుకోండి
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:36 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించారని వైసీపీ నేత జోగి రమేశ్‌పై ఎస్‌ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించారని వైసీపీ నేత జోగి రమేశ్‌పై ఎస్‌ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఈనెల 6న ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ కేసు కొట్టేయాలని జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌పై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే అయినందున బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చిన వివరణ తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.