హనుమాన శోభయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:03 PM
హనుమాన శోభా యాత్రను పండుగ వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు.
హొళగుంద, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : హనుమాన శోభా యాత్రను పండుగ వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు. ఏప్రిల్ 2న హనుమాన శోభాయాత్ర సందర్బంగా సోమవారం స్థానిక పోలీస్ స్టేషనలో ఆయా మతాల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పండుగలను అన్ని వర్గాల ప్రజలు మతసా మరస్యంతో సంబరంగా చేసుకోవాలే తప్ప వివాదాలకు దారితీసే విధంగా ఉండకూడదని సూచించారు. ఏదైనా సున్నితమైన విషయా లు చోటుచేసుకున్నప్పుడు పెద్దలు వాటిని సవరించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. హొళగుంద మండలం ప్రశాంతతకు నిలయ మని, ఇక్కడ హిందూ, ముస్లిం సోదరభావంతో కలిసి ఉండటం అభినందనీయమని అన్నారు. ఇదే స్పూర్తితో అన్ని పండుగలను ఐక్యమత్యంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ నిజాముద్దీన, ఆలూరు సీఐ రవిశంఖర్ రెడ్డి, ఎస్సై దిలీప్ కుమార్, గురజాల, ఆయా మత పెద్దలు పాల్గొన్నారు.