Share News

606 కోట్లతో హంద్రీనీవా ‘ప్యాకేజీ 35ఏ’ పనులు

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:38 AM

హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్ఎస్) ఫేజ్‌-1లోని ప్యాకేజీ నంబరు 36ఎలో మిగిలిపోయిన పనులు, ఫీడర్‌ చానల్‌ విస్తరణ, ఆఫ్‌టేక్‌ స్లూయిస్‌ నిర్మాణ పనులను రూ.606 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతుల్చింది.

606 కోట్లతో హంద్రీనీవా ‘ప్యాకేజీ 35ఏ’ పనులు

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్ఎస్) ఫేజ్‌-1లోని ప్యాకేజీ నంబరు 36ఎలో మిగిలిపోయిన పనులు, ఫీడర్‌ చానల్‌ విస్తరణ, ఆఫ్‌టేక్‌ స్లూయిస్‌ నిర్మాణ పనులను రూ.606 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతుల్చింది. ఈమేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వు జారీ చేశారు.

3 జిల్లాల్లో రూ.67.18 కోట్లతో నీటివనరుల అభివృద్ధి

కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న రిపేర్‌, రెనోవేషన్‌, రిస్టోరేషన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) పథకం కింద రూ.67.18 కోట్లతో అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 129 నీటి వనరులు, చెరువులను అభివృద్ధి చేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారంనాడు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ పాలనామోదం తెలుపుతూ ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - Apr 02 , 2026 | 04:38 AM