Share News

BIS Deputy Director Vivek Vardhan Reddy: ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌తో భద్రత

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:09 AM

బంగారు, వెండి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ అనేది స్వచ్ఛతకు, నాణ్యతకు ప్రామాణికంగా నిలుస్తుందని భారతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో...

BIS Deputy Director Vivek Vardhan Reddy: ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌తో భద్రత

  • బీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వివేక్‌వర్ధన్‌రెడ్డి

విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): బంగారు, వెండి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ అనేది స్వచ్ఛతకు, నాణ్యతకు ప్రామాణికంగా నిలుస్తుందని భారతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో (బీఐఎస్‌) డిప్యూటీ డైరెక్టర్‌, సైంటిస్ట్‌ డి.వివేక్‌వర్ధన్‌రెడ్డి తెలిపారు. బీఐఎస్‌ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వినియోగదారుల పరిరక్షణ కోసం చేపట్టే కార్యక్రమాలను ఆయన వివరించారు. బంగారం, వెండి కొనుగోలు చేసేటప్పుడు హాల్‌ మార్కింగ్‌ పరిశీలన చేయాలని పేర్కొన్నారు. ఆభరణాల స్వచ్ఛత, గుర్తింపును హాల్‌ మార్కింగ్‌ ధ్రువీకరిస్తుందన్నారు. భారత ప్రభుత్వం 2021 జూన్‌ నుంచి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేసిందన్నారు. బీఐఎస్‌ చట్టం ప్రకారం హాల్‌ మార్కింగ్‌ చేయకుండా ఆభరణాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొనుగోలుదారులకు రక్షణగా బీఐఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందని, దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

Updated Date - Jan 06 , 2026 | 06:09 AM