Share News

ఇందిరేశ్వరంలో వడగండ్ల వాన

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:42 PM

మండలంలోని ఇందిరేశ్వరం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది.

   ఇందిరేశ్వరంలో వడగండ్ల వాన
వడగండ్ల వాన కురుస్తున్న దృశ్యం

ఆత్మకూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఇందిరేశ్వరం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గ్రామంలో వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షంతో పలు పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.

భారీ వర్షంతో మినుము రైతులకు తీవ్ర నష్టం

పాములపాడు : మండలంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మినుము రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలిమిళ్ళ, లింగాల, పాములపాడు తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి పొలాల్లో కోసి ఉంచిన మినుములు, జొన్న, మిరపపంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 11:42 PM