Share News

జయహో గురు రాఘవేంద్రా

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:31 AM

జయహో గురు రాఘవేంద్రా..... విజయహో......తుంగాతీరా నివాసా....

    జయహో గురు రాఘవేంద్రా
భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు

మంత్రాలయంలో వైభవంగా ముగిసిన గురు వైభవోత్సవాలు

ఘనంగా రాఘవేంద్రస్వామి 431వ జన్మదిన వేడుకలు

నవరత్నాల రథంపై దర్శనమిచ్చిన స్వామి

మంత్రాలయం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జయహో గురు రాఘవేంద్రా..... విజయహో......తుంగాతీరా నివాసా.... అంటూ దేశం నలుమూలల నుంచి అశేష భక్తజనవాహిని రాఘవేంద్రస్వామి నామస్మరణ చేశారు. గురు వైభవోత్సవాల్లో ఆఖరి రోజు మంగళవారం రాఘవేంద్రస్వామి 431వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో రాఘవరాయడి మూల బృందావనానికి పీఠాధిపతి పంచామృతాభిషేకం నిర్వహించారు. రాఘవేంద్రస్వామిని నవరత్నాల రథంపై ఊరేగించారు. రథం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చెన్నైకి చెందిన రాఘవేంద్రస్వామి నాదహార సేవ ట్రస్టుకి చెందిన 350 మంది సంగీత విద్వాంసుల కార్యక్రమంతో మంత్రాలయం మార్మోగింది.

ఫ భక్తుల కోర్కెలు తీర్చే రాఘవేంద్రుడు

రాఘవేంద్రుడు బృందావనంలో సజీవులుగా ఉంటూ భక్తుల కోర్కెలు తీరుస్తారని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు ఇచ్చే విరాళాలతో శ్రీమఠం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని అన్నిరు.

ఫ రమణీయం... ప్రహ్లాదరాయల తెప్పోత్సవంః-

ప్రహ్లాదరాయలకు పుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవం రమణీయంగా సాగింది. నిర్వహించారు. విద్యుత దీప కాంతుల మధ్య స్వామి తెప్పోత్సవం కనువిందు చేసింది.

ఫ భక్తులను ఆకట్టుకున్న భరతనాట్యం:

యోగీంద్ర కళామండపంలో బెంగుళూరు చెందిన సంజీవని కళా సమితి వారి భరతనాట్యం, బెంగుళూరు చెందిన నాగశ్రీ దాసవాణి సాహిత్యం భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పండిత కేసరి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాజాఎస్‌ గిరిరాజాచార్‌, మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేశ జోషి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:31 AM