బడ్జెట్ భేటీకి ఎమ్మెల్యేలందరూ హాజరవ్వాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:08 AM
‘రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు అర్థవంతం గా జరిగేందుకు పార్టీ విప్‌లు బాధ్యత తీసుకోవాలి’ అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు.
ఆ బాధ్యత విప్‌లు తీసుకోవాలి: చీఫ్ విప్ జీవీ
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు అర్థవంతం గా జరిగేందుకు పార్టీ విప్‌లు బాధ్యత తీసుకోవాలి’ అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టీడీపీ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్‌ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీవీ మాట్లాడుతూ... ‘బడ్జెట్ సమావేశాలకు అధికార పార్టీల ఎమ్మెల్యేలు 100 శాతం హాజరయ్యేలా చూడాలి. సభకు వచ్చిన వారు సభ జరిగినంత సేపు సభలో ఉండేలా చూడాల్సిన బాధ్యత విప్‌లదే’ అని స్పష్టం చేశారు.