థాయ్‌లాండ్ బీచ్ కుస్తీ పోటీలకు గురుకుల విద్యార్థి
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:56 AM
థాయ్‌లాండ్‌లో మార్జిలో జరగనున్న బీచ్ కుస్తీ పోటీలకు దేశం తరఫున ఏపీ నుంచి ఎంపికైన గురుకుల విద్యార్థిని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అభినందించారు.
శివమల్లికార్జునను అభినందించిన మంత్రి డోలా
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): థాయ్‌లాండ్‌లో మార్జిలో జరగనున్న బీచ్ కుస్తీ పోటీలకు దేశం తరఫున ఏపీ నుంచి ఎంపికైన గురుకుల విద్యార్థిని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అభినందించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులంలో శివమల్లికార్జున 9వ తరగతి చదువుతున్నాడు. జనవరి 23 నుంచి 26 వరకు విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి బీచ్ కుస్తీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్, జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించి, థాయ్‌లాండ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం సచివాలయంలో శివమల్లికార్జునను మంత్రి స్వామి అభినందించారు.