Share News

ఘనంగా గురు రాఘవేంద్ర స్వామి జయంతి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:30 AM

గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పట్టణంలోని మంగళ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం ఘనంగా జరుకున్నారు.

 ఘనంగా గురు రాఘవేంద్ర స్వామి జయంతి
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఆదోని టౌన, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పట్టణంలోని మంగళ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం ఘనంగా జరుకున్నారు. రాయరు వారికి పాల పంచామృతాభిషేకం, అష్టోత్తర పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులచే రాఘవేంద్ర స్వాముల వారికి రథోత్సవ కారక్రమం కన్నుల పండుగగా జరిపారు. భక్తులు పాల్గొని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. అర్చకులు గురురాజ్‌ ఆచార్‌, ఆలయ మేనేజర్‌ భీమ్‌రావు, నాకాతే శ్రీధర్‌, వాదిరాజ్‌, చక్రవర్తి దేశాయ్‌, ఎస్‌డి గిరి, అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:30 AM