తెలుగు భాషకు వన్నె తెచ్చిన జాషువా
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:42 AM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
డాక్టర్ గరికిపాటి గురజాడ
ఘనంగా జాషువా 131వ జయంతి వారోత్సవాలు ప్రారంభం
గుంటూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషకు తన రచనల ద్వారా జాషువా వన్నె తెచ్చారని తెలుగు శాఖ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు డాక్టర్ గరికిపాటి గురజాడ అన్నారు. మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి వారోత్సవాలు గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయం త్రం వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలోని అన్నమయ్య కళా వేదికపై మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో జాషువా పద్యానికి పట్టాభిషేకం అనే అంశంపై వారోత్సవాలను మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గరికిపాటి గురజాడ మాట్లాడుతూ, సామాన్యుల హృదయాలకు హత్తుకునే మహాకావ్యాలను రచించిన నవయుగ వైతాళికుడు జాషువా అని చెప్పారు. అనంతరం సినిమా సంగీత దర్శకుడు టి.రాజబాబు, కవి నూతక్కి ప్రజ్ఞాచారి, రచయిత కేజే రమేశ్‌ను సత్కరించారు.