Share News

గురజాడ గృహానికి కొత్త సొబగులు

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:09 AM

అభ్యుదయ కవి గురజాడ అప్పారావు స్వగృహం త్వరలో కొత్త సొబగులు దిద్దుకోనుంది. విజయనగరంలోని ఈ ఇంటిని ఆధునికీకరించే....

గురజాడ గృహానికి కొత్త సొబగులు

  • ఆడిటోరియం నిర్మాణానికి రూ.1.20కోట్లతో ప్రతిపాదనలు

  • వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాలయం

విజయనగరం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): అభ్యుదయ కవి గురజాడ అప్పారావు స్వగృహం త్వరలో కొత్త సొబగులు దిద్దుకోనుంది. విజయనగరంలోని ఈ ఇంటిని ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. అందులో ఆడిటోరియం నిర్మించేందుకు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం బుధవారం తెలిపింది. మరోవైపు గురజాడ రచనల డిజిటలైజేషన్‌ ప్రక్రియ కూడా జరగనుంది. ఆయన గుర్తులు పదికాలాలు నిలిచి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గురజాడ గృహం ఆధునికీకరణకు సంబంధించి నేడో, రేపో జీవో విడుదల కానున్నట్లు తెలిసింది. కాగా, గతేడాది ఆగస్టు 24న విశాఖలో జనసేన సభ నిర్వహించారు. ఆ సమయంలో గురజాడ స్వగృహం దుస్థితిని ఆ పార్టీ నేతలు పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చలించిన పవన్‌.. ఆ మహనీయుడి నివాసగృహాన్ని ఆధునికీకరిస్తామని, ఆయన రచనలను డిజిటలైజేషన్‌ చేస్తామని ప్రకటించారు. ఆ హామీల అమలు దిశగా నేడు అడుగులు పడుతున్నాయి.

Updated Date - Jun 04 , 2026 | 05:09 AM