వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:11 AM
గుంటూరులోని నల్లచెరువు ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు (శనివారం తెల్లవారుజామున) ఫణీంద్రరెడ్డి అనే ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు...
గుంటూరు మెడికల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): గుంటూరులోని నల్లచెరువు ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు (శనివారం తెల్లవారుజామున) ఫణీంద్రరెడ్డి అనే ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేశాయి. బాలుడి తల, మెడ భాగాల్లో లోతైన గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసిన విషయం తెలియడంతో శుక్రవారం అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ప్రభుత్వాస్పత్రికి వచ్చి అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.