Share News

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్లతో సరికొత్త ఆర్థిక అవకాశాలు: సీఎం

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:05 AM

గుంతకల్లు-బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్‌ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్లతో సరికొత్త ఆర్థిక అవకాశాలు: సీఎం

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): గుంతకల్లు-బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్‌ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘రూ.1264 కోట్లతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మొత్తం పెట్టుబడిలో రూ.600 కోట్లు ఏపీలోనే ఖర్చు చేస్తున్నారు. తూర్పు, పడమర రైల్వే కారిడార్‌ మరింత బలోపేతమయ్యేందుకు ఈ రైల్వే లైన్లు ఉపయోగపడతాయి. ఈ రైల్వే లైన్ల వల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కల్పిస్తూ ఏపీ అభివృద్ధికి మద్దతిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు’ అని సీఎం పేర్కొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 05:07 AM