గుమ్మడి పేరిట నంది అవార్డు
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:24 AM
దివంగత ప్రముఖ సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు పేరిట నంది అవార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు.
గుమ్మడి పేరిట నంది అవార్డు
శత జయంతి సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
అప్పాజోస్యులకు గుమ్మడి విశిష్ట కళా పురస్కారం
తెనాలి అర్బన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): దివంగత ప్రముఖ సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు పేరిట నంది అవార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన గురువారం గుమ్మడి శత జయంతి సభ నిర్వహించారు. ప్రముఖ సాహిత్యవేత్త, అజోవిబో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణను డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట కళా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ సినీ రంగంలో గుమ్మడి జీవితం అందరికి ఆదర్శమని, ఆయన పేరిట నంది అవార్డులు ఇచ్చేందుకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో చర్చిస్తానని తెలిపారు. సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ ప్రముఖ నటునిగా, మాధవిపెద్ది శిష్యునిగా ఎదిగిన గుమ్మడి.. పాత్రల కోసం ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటి ప్రభ, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ రచయిత రెంటాల జయదేవ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, కందిమళ్ల సాంబశివరావు, గుమ్మడి కుమారుడు సత్యనారాయణ, మనుమడు వెంకట్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.