Share News

ఆమె మేకప్‌ మంత్రి.. అనితపై అమర్‌ అనుచిత వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:03 AM

హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఆమె మేకప్‌ మంత్రి.. అనితపై అమర్‌ అనుచిత వ్యాఖ్యలు

చోడవరం(అనకాపల్లి జిల్లా), జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ శుక్రవారం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నరసయ్యపేటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘జిల్లాలో ఒక మేకప్‌ మంత్రి ఉన్నారు. ఆమెను ఒక గంటసేపు ఎండలో ఉంచితే కిలో మేకప్‌ రాలిపడుతుంది. ఆ మేకప్‌ రంగులతో ఇంటి గోడకు పుట్టీ వేసుకోవచ్చు’ అని అమర్‌ నోరు పారేసుకున్నారు. ‘ఆమె ఏం ఉద్యోగాలు చేశారో, ఉద్యోగం కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో తెలీదు. కానీ అలాంటి కష్టాలైతే మా మహిళలు పడేందుకు సిద్ధంగా లేరు’ అని పేర్కొన్నారు. తాను వాడి వదిలేసిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో తిరుగుతూ... తనపై విమర్శలు చేయడానికి అనితకు సిగ్గూశరం ఉందా అన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 06:04 AM