జనసేనలో చేరిన గుడిపాటి సీతారామ్
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:55 AM
విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని..
సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్‌ను కలిసి పార్టీలో చేరారు. గడిపాటిని పవన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ‘నేషన్ ఫస్ట్’(దేశమే ముందు) అనే దృక్పథం ఉన్న పవన్ కల్యాణ్ నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరినట్లు సీతారామ్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు, అధినేత ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు.