నక్కపల్లిలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి 23న శంకుస్థాపన
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:50 AM
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్‌పి) ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని...
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి
భీమవరం టౌన్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్‌పి) ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ భారీ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందన్నారు. రూ.1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుందన్నారు. తొలి దశలో రూ.80వేల కోట్ల భారీ పెట్టుబడితో పనులు ప్రారంభమవుతాయని, 2029 నాటికి మొదటి దశ పూర్తి చేసి, ఏటా 88.2మిలియన్ టన్నుల (ఎంటీపీఎ) ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీనివాసవర్మ వివరించారు. ఉత్పత్తి సామర్థ్యం విశాఖ ఉక్కు ప్లాంట్ (7.3ఎంటిపిఎ) కంటే కూడా అధికమని, తదుపరి దశలో దీనిని 18.7 వరకు విస్తరించి దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.