ప్రకాశం బ్యారేజీని సందర్శించిన జీఆర్‌ఎంబీ చైర్మన్
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:34 AM
పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకంపై తెలంగాణ ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో గోదావరి నదీ జల యాజమాన్య సంస్థ...
నేడు గోదావరి బేసిన్‌పై ఈఎన్‌సీతో సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకంపై తెలంగాణ ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో గోదావరి నదీ జల యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) చైర్మన్ పద్మా దోర్జా గ్యాంబా విజయవాడకు వచ్చారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గోదావరి పరీవాహక ప్రాంతంపై అవగాహన పెంచుకోవాలని నిర్ణయించారు. ఆదివారం ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. పట్టిసీమ నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే చోటును కూడా పరిశీలించారు. సోమవారం ఈఎన్‌సీ నరసింహమూర్తితో గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. సాయంత్రం రాజమండ్రికి వెళతారు. ఈ నెల 15వ తేదీన పెద్దవాగును పరిశీలిస్తారు.