Share News

Amaravati Secretariat: సచివాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 05:43 AM

అమరావతి సచివాలయంలో ఉద్యోగుల సంఘం(అప్సా) ఆధ్వర్యంలో బుధవారం మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు, పురుష ఉద్యోగులకు వాలీబాల్‌ పోటీలు...

Amaravati Secretariat: సచివాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయంలో ఉద్యోగుల సంఘం(అప్సా) ఆధ్వర్యంలో బుధవారం మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు, పురుష ఉద్యోగులకు వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. సచివాలయం, అసెంబ్లీ, లోక్‌భవన్‌కు చెందిన దాదాపు 300 మంది అధికారులు, ఉద్యోగులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అప్సా అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పవన్‌ కుమార్‌, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మణకుమారి, నాపా ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 05:44 AM