Share News

ఘనంగా మన్మథ స్వామి పూల రథోత్సవం

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:33 PM

పట్టణంలోని కిలిచిన పేట అంబా భవాని దేవాలయంలో హో లీ పండుగను పురస్కరించుకొని సోమ వారం అర్ధరాత్రి మన్మథ పూల రథోత్స వం ఏనుగు అంబారీపై నిర్వహించారు.

 ఘనంగా మన్మథ స్వామి పూల రథోత్సవం
అంబారిపై మన్మథ స్వామి ఊరేగింపు

అంబారిపై ఊరేగింపు

ఆదోని అగ్రికల్చర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని కిలిచిన పేట అంబా భవాని దేవాలయంలో హో లీ పండుగను పురస్కరించుకొని సోమ వారం అర్ధరాత్రి మన్మథ పూల రథోత్స వం ఏనుగు అంబారీపై నిర్వహించారు. మేళా తాళాలతో సాంప్రదాయ వాయి ద్యాల మధ్య పురవీఽధుల గుండా ఊరే గింపు సాగింది. తెల్లవారుజామున కా ముని దహనం చేశారు. శివపార్వతుల ఉత్సవమూర్తులను గంగాస్నానం చేసి హోలీ సంబరాలు చేసుకున్నారు. సం బరాలను చూసేందుకు పుర ప్రజలు భారీగా తరలివచ్చారు. అంబా భవాని ఆలయ కమిటీ సభ్యులు స్వకుల సాలే సమాజ్‌ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:33 PM