వైభవంగా వాదీంద్రతీర్థుల ఆరాధన
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:02 AM
మంత్రాలయం రాఘ వేంద్రస్వామి శిష్యుడైన పూర్వ పీఠాధిపతి వాదీంద్రతీర్థుల ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహిం చారు.
మంత్రాలయం, జూన 23(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘ వేంద్రస్వామి శిష్యుడైన పూర్వ పీఠాధిపతి వాదీంద్రతీర్థుల ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహిం చారు. మంగళవారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్ధుల ఆధ్వర్యంలో బంగారు రథంపై వాదీంద్రతీర్థుల బృందావన చిత్రపటాన్ని అధిష్టించి పీఠాధిపతి ప్రత్యేక పూజలు, హారతుల ఇచ్చిన అనంతరం రథాన్ని ముందుకు లాగారు. మహిళల భజనలు, కోలాట నృత్యాలు, వాయిద్యాలతో మఠం ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు వాదీంద్రతీర్థుల బృందావనానికి పీఠాధిపతి విశేష పంచామృతాభిషేకం, క్షీరాభిషేకంచేసి వివిధ రకాల పుష్పాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతాచార్, ఏఈ బద్రినాథ్, అనంత పురాణిక్, ద్వారపాలక అనంత స్వామి పాల్గొన్నారు.