Share News

వైభవంగా జ్యోతుల మహోత్సవాలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:44 PM

పట్టణంలో మంగళవారం మహాలయ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని చౌడే శ్వరిదేవి జ్యోతుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

 వైభవంగా జ్యోతుల మహోత్సవాలు
పత్తికొండలో జ్యోతుల ప్రదర్శన నిర్వహిస్తున్న భక్తులు

- పత్తికొండలో మహాలయ పౌర్ణమి వేడుకలు

పత్తికొండ టౌన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో మంగళవారం మహాలయ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని చౌడే శ్వరిదేవి జ్యోతుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణం లోని చౌడేశ్వరిదేవి ఆలయంలో అర్ధరాత్రి నుంచి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజా మున 4 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన తోటక్షత్రి యలు అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తోట క్షత్రియలు రెండు గుంపులుగా విడిపోయి తలపై జ్యోతులను పెట్టుకుని భక్తి గీతాలతో నృత్యాలు చేస్తూ భక్తులను కను విందు చేశారు. జ్యోతులను తిలకించేందుకు ప్రజలు తరలివచ్చారు.

Updated Date - Sep 29 , 2026 | 11:44 PM