ప్రభుత్వం నెరవేరుస్తుంది
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:02 PM
పేదల సొంతింటి కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు
ఆదోని రూరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : పేదల సొంతింటి కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ‘ప్రధానమంత్రి అవాజ్ యోజన’ ‘మన ఇల్లు మన గౌరవం’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నారాయణపురంలో లబ్ధిదారుడు సోమప్ప ఇంటిని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, రాష్ట్ర కురువ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప, సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులు త్వరగా గృహాలను నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగరాజు స్వామి, తహసీల్దారు శేషుఫణి, టీడీపీ నాయకులు శ్రీకాంతరెడ్డి, ఉమ్మి సలీమ్, జనసేన నాయకులు పులిరాజా, తదితరులు పాల్గొన్నారు.
కూటమిలో సయోధ్య కరువు...
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కానీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన డైరెక్టర్ ఆరేకల్ రామకృష్ణ హాజరుకాకపోవడంపై కూటమిలో సయోధ్య కరువైనట్లు కనిపించింది. ఈ కార్యక్రమానికి సర్పంచ సరళమ్మను ఆహ్వానించకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను గ్రామ సర్పంచునని, తనకు కూడా సమాచారం ఇవ్వకుండా అవమానించడం బాధాకరమన్నారు.