క్రీడాకారులకు 3శాతం రిజర్వేషన్లు: రాంప్రసాద్ రెడ్డి
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:51 AM
రాష్ట్రంలో అర్హులైన, ప్రతిభావంతులైన క్రీడాకారులకు మూడు శాతం సమాంతర రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన, ప్రతిభావంతులైన క్రీడాకారులకు మూడు శాతం సమాంతర రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా క్రీడా నియామకాల్లో క్రీడాకారులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కోరారు. 2024లో సీఎం చంద్రబాబు క్రీడాకారులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 2 శాతం రిజర్వేషన్‌ను 3 శాతం చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ అంశంపై సీఎంతో చర్చిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 శాతం క్రీడా కోటాలో 420 టీచర్ల పోస్టులను భర్తీ చేశామన్నారు.